Homeహైదరాబాద్latest Newsమారకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత..డ్రగ్స్ మహమారిని తరిమేద్దాం..డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం

మారకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత..డ్రగ్స్ మహమారిని తరిమేద్దాం..డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం

ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మారకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా సీఐ రామ్ నరసింహారెడ్డి ఎమ్మార్వో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి విద్యార్థులు,సిబ్బందిచే కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిఐ రామ నర్సింహారెడ్డి, మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కళాశాల పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటాయని తెలిపారు. గ్రామాలలో పట్టణాలలో మారకద్రవ్యాల విషయములో మారకద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మార్వో కృష్ణ చైతన్య ఎస్సై ఉదయ్ కుమార్ పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img