Homeహైదరాబాద్latest Newsహీరో విజయ్ కీలక ప్రకటన.. పార్టీ జెండా ఆవిష్కరించిన విజయ్.. ఎలా ఉందో చూడండి..!(వీడియో)

హీరో విజయ్ కీలక ప్రకటన.. పార్టీ జెండా ఆవిష్కరించిన విజయ్.. ఎలా ఉందో చూడండి..!(వీడియో)

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఈ ఏడాది ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో విజయ్ ఈ జెండాను ఎగురవేశారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న పార్టీ జెండాపై రెండు ఏనుగులు అటూ ఇటూ ఉన్నాయి. జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా ఆయన విడుదల చేశారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సును భారీ ఎత్తున నిర్వహిస్తానని తెలిపారు. అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. దాని కంటే ముందు పార్టీ జెండాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. తమిళనాడు సంక్షేమం కోసం కృషి చేస్తానని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img