Homeహైదరాబాద్latest Newsడ్రగ్స్ పై విద్యార్థులకు ఎస్సై అవగాహన కార్యక్రమం

డ్రగ్స్ పై విద్యార్థులకు ఎస్సై అవగాహన కార్యక్రమం

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం, పోతుగల్ జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు డ్రగ్స్ పై ఎస్సై చిందం గణేష్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. డ్రగ్ నిర్మూలనపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువదే కీలక పాత్ర. కాబట్టి, మాదకద్రవ్య రహిత భారత్ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ, ఈ రోజు మనం నషా ముక్త్ భారత్ అభియాన్ క్రింద ఐక్యమై ప్రతిజ్ఞ తీసుకుందాం. సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడ మాదకద్రవ్య రహితముగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా ను మాదకద్రవ్యల రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ఎస్సై గణేష్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గణేష్ పోలీస్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img