Homeహైదరాబాద్latest Newsకలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు: నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు: నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ఇదేనిజం, నాగర్ కర్నూల్: రానున్న 48 గంటలలో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి బాదావత్ సంతోష్ తెలిపారు.
భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08540-230201 కు సమాచారం అందించాలని సూచించారు.ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం 24/7 పని చేస్తుందని, కంట్రోల్ రూమ్ ద్వారా సమాచార సేకరణ కోసం ప్రత్యేకంగా అధికారిక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనట్లు ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఏ సమయంలోనైనా ప్రజలు ఫోన్ ద్వారా కంట్రోల్ రూంకు సమాచారం తెలుపవచ్చని సూచించారు.వర్ష ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా ఆయా శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img