ఇదేనిజం, చింతల మనేపల్లి : ఈ రోజు MPDO మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో “ప్రజా పాలన సేవ కేంద్రం”ను ప్రారంభించడం జరిగింది. ప్రజా పాలన ఇన్-ఛార్జ్ భద్రుల్ హాక్ అసిస్టెంట్ మాట్లాడుతూ దరఖాస్తులను MPDO కార్యాలయంలోనే స్వీకరిస్తారని, ఎవరైనా దరఖాస్తులు చేయని వారు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవచ్చు అని తెలిపారు.పూర్తి సమాచారం ద్వారా దరఖాస్తులు చేయాలనీ మండల వాసులకు తెలియజేశారు.