Homeఫ్లాష్ ఫ్లాష్Etala Jamuna:కౌశిక్ రెడ్డి ఓ పిచ్చికుక్క-ఈటల జమున

Etala Jamuna:కౌశిక్ రెడ్డి ఓ పిచ్చికుక్క-ఈటల జమున

Etala Jamuna: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈటల జమున మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి .. ఈటల రాజేందర్ హత్యకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నారని జమున వ్యాఖ్యానించారు.

మా కుటుంబ సభ్యులది ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. కౌశిక్ రెడ్డి ఓ పిచ్చికుక్క. తెలంగాణ ఉద్యమకారులంటే.. మొదట వినిపించే పేరు ఈటల రాజేందర్. పిచ్చి కుక్కను సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ చేసి హుజూరాబాద్ ప్రజల మీదకు వదిలారు. హుజురాబాద్‌లో పిచ్చి కుక్క అరాచకాలు పెరిగిపోయాయి. హుజూరాబాద్ ప్రజలు, మహిళల పట్ల ఇష్టానుసారంగా పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నారు.
ఎమ్మెల్సీ పిచ్చి చేష్టలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి. అమరవీరుల స్థూపాన్ని ఉద్యమంలో లేని పిచ్చికుక్క కూల్చివేయించాడు. అమరవీరుల స్థూపం తాకే అర్హత ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి లేదు.

అమరవీరుల స్థూపం పునర్నిర్మాణం కోసం ఉద్యమం చేస్తాం. శిలాఫలకంపై ఈటల రాజేందర్ పేరు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డి కూల్చి వేయించారు. ఉద్యమకారులను కొట్టించిన వ్యక్తి కౌశిక్ రెడ్డి. అమరవీరుల స్థాపాన్ని కూల్చిన వ్యక్తిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. మహిళా గవర్నర్‌ను ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదు. హుజూరాబాద్‌ను మంత్రి కేటీఆర్ కౌశిక్ రెడ్డికి అప్పజెప్పాలని చూస్తున్నారు. ఈటల రాజేందర్ పుణ్యాన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. హుజురాబాద్ కో-సర్పంచ్‌లపై కౌశిక్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడతారన్న నమ్మకంతో హుజూరాబాద్‌లో ఈటలను గెలిపించారు. ఇప్పుడు గుర్తింపు కోసం ఈటలను కౌశిక్‌రెడ్డి తిడుతున్నారు.’’ అని ఆరోపించారు

Recent

- Advertisment -spot_img