తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎంపీ ఈటల రాజేందర్ పేరును ఢిల్లీ పెద్దలు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్న వారితో పోలిస్తే ఈటల బెటర్ అని కాషాయ పెద్దలు భావిస్తున్నారట. అధ్యక్షుడు కావడానికి RSS బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదంటూ ఇటీవల కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. మిగతా వారితో పోలిస్తే నాన్ కాంట్రవర్షియల్ నేతగా, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్న ఈటలే బెటర్ అన్న ఆలోచనలో అధిష్టానం ఉందంట.