గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లో విడుదల కానుంది.ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. అయితే ఈ సినిమా టికెట్ రేట్లు హైక్ విషయంలో నిర్మాత దిల్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేసారు. అడగందే అమ్మైనా పెట్టదు.. టికెట్ రేట్లు హైక్ ఇవ్వండని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడిగాను. సినిమా టికెట్ రేట్లు హైక్ ఇచ్చేది, ఇవ్వనిది రేవంత్ రెడ్డి చేతిలో ఉంది అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమాలకు అన్నీ ఇస్తానని అన్నాడు నేను ఆ ఆశ తోనే ఉన్నాను అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు ఇచ్చారు.. తెలంగాణలో కూడా ఇవ్వండని ప్రభుత్వాని అడుగుతున్న అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.