వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కొత్త కంటెస్టెంట్స్ సరికొత్త వినోదాన్ని అందిస్తున్నారు. హరితేజ, నాయని పావని, టేస్టీ తేజ, అవినాష్, గౌతమ్, రోహిణి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వచ్చారు. అయితే వీరిలో టేస్టీ తేజ, అవినాష్, రోహిణి, గంగవ్వ తమ మార్క్ కామెడీ పంచ్‌లతో జనాలని అలరిస్తున్నారు. ఈ వారంలో ఆరుగురు పోటీదారులు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో విష్ణుప్రియ, కిరాక్ సీత, పృథ్వీ, యష్మీ గౌడ, గంగవ్వ, మెహబూబ్‌లు నామినేషన్లు వేశారు. ఆన్‌లైన్ ఓటింగ్ ఫలితాలు రోజురోజుకు మారుతున్నాయి. బిగ్‌బాస్‌లోకి మరోసారి రీఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఓటింగ్‌లో దూసుకుపోతోంది. ఆమెకు 29 శాతం ఓట్లు రాగా, మెహబూబ్ (17.10 శాతం) రెండో స్థానంలో నిలిచారు. విష్ణుప్రియ 16.97 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలవగా, యష్మీ గౌడ 16.61 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. సీత (11.12 శాతం) యధావిధిగా జాబితాలో ఉండగా… పృథ్వీ (15.02 శాతం) అనూహ్యంగా ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లోకి వచ్చారు. నిన్నటి వరకు ఐదో స్థానంలో నిలిచిన యష్మీ.. ఇప్పుడు ఓటింగ్‌ను మెరుగుపరుచుకుంది. తాజా ఓటింగ్ ప్రకారం సీత, పృథ్వీరాజ్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారు.