బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సోమి అలీ చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో టాప్ స్టార్. సల్మాన్ ఖాన్ తన సినిమాలకు ఎంత ఫేమస్ అయ్యాడో వివాదాలకు కూడా అంతే ఫేమస్. జింకను కాల్చడం, ప్లాట్‌ఫారమ్‌పై నిద్రిస్తున్న వారిపై కారు నడపడం, అభిమాని సెల్‌ఫోన్‌ను పగలగొట్టడం వంటి హింసాత్మక సంఘటనలతో వార్తలో నిలిచాడు. పెళ్లి చేసుకోని సల్మాన్ ఖాన్ జీవితంలో చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో సోమి అలీ ఒకరు. ఆమె 1991 నుండి 1999 వరకు సల్మాన్ ఖాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. కానీ అతని కార్యకలాపాలు నచ్చక అతన్ని విడిచిపెట్టాడు. “సల్మాన్ ఖాన్ భయంకరమైన వ్యక్తి.. అయితే అతనితో ప్రేమలో ఉన్న వారికి అది తెలియడానికి 7 ఏళ్లు పడుతుంది. అందుకే సల్మాన్ ఖాన్‌తో ప్రేమలో పడిన మహిళలు 7 ఏళ్లకు మించి తట్టుకోలేరు. ఆ తర్వాతే అతని అసలు ముఖం తెలుస్తుంది” అని ఆమె పేర్కొంది. నేను అతనితో ప్రేమలో ఉన్నప్ప్పుడు అతని శారీరక, మానసిక వేధింపులను ఎక్కువ కాలం భరించలేకపోయాను అని మాజీ ప్రియురాలు సోమి అలీ సంచలన వ్యాఖ్యలు చేసారు.