- పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు లక్ష్యాలుగా స్వచ్చదనం-పచ్చదనం
ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని కే.కే. మహేందర్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ప్రారంభించారు. ప్రతి ఇల్లు, గ్రామం, పట్టణం స్వచ్చంగా.. పచ్చగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం.. స్వచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ముస్తాబాద్ లో కార్యక్రమాన్ని చేపట్టగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. అనంతరం ముస్తాబాద్ కొత్త బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం దాకా చేపట్టిన ర్యాలీ లో పాల్గొన్న కలెక్టర్, డీపీఓ వీర బుచ్చయ్య, మహిళా సంఘాల బాధ్యులు, విద్యార్థులు పాల్గొని, నినాదాలు చేశారు.
స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం క్రింద ఆగస్టు 5 నుంచి 9 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య వివరించారు. పలువురు రైతులకు సేంద్రియ ఎరువుల పంపిణీ చేశారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు రూపొందించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య నిర్వహణ పచ్చధనం పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు వారం లో రెండు రోజులు డ్రై డే గా పాటించాలని, ఇంట్లోని పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్చదనం – పచ్చదనం* కార్యక్రమం ద్వారా మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతామో అదే విధంగా మన గ్రామాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
డెంగ్యూ వ్యాధి నియంత్రణలో జిల్లా పనితీరు మెరుగ్గా ఉందని, భవిష్యత్తు లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్ కింద ఎత్తైన మొక్కలు మన నర్సరీల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు .విద్యుత్ లైన్లు, త్రాగునీటి సరఫరా పైప్ లైన్లకు దూరంగా అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు.
ముస్తాబాద్ తహసిల్దార్ కార్యాలయ తరలింపు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే ఎస్సీ కాలనీ లోని డంపింగ్ యార్డ్ తరలింపు సాధ్యా సాధ్యలపై నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని సూచించారు.
డ్రైనేజీ వాటర్ మానేరు నదిలో కల్వకుండా కమ్యూనిటి సోప్ కిట్ నిర్మించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన భూమి గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని కలెక్టర్ తెలిపారు. స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో మంచి ఫలితాలు సాధించాలని, నర్సరీ లో మంచి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన మేర గ్రామంలో పచ్చదనం పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని అన్నారు.
నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాలను ప్రతి రోజు పక్కాగా నిర్వహించి రాష్ట్రంలోనే మన జిల్లా ప్రధమ స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని , ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చిన్నతనం నుంచే పారిశుధ్య నిర్వహణ పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం కే కే మహేందర్ మాట్లాడారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, చెట్లు లేకపోవడం వల్ల గ్రామంలో కోతుల సమస్యలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందని ఆ దిశగా మనమంతా కృషి చేయాలని అన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో వర్షా బావ పరిస్థితుల వల్ల నేటి సమస్య ఉండేదని, గతంలో దీని నియంత్రించేందుకు నిజాం ప్రభుత్వం అపర్ మానేర్ ప్రాజెక్టు నిర్మించిందని, మనం వీలైనంత ఎక్కువ చెట్లు నాటడం వల్ల మనకు అంత మంచి జరుగుతుందని అన్నారు
అనంతరం ఎగువ మానేరు నుంచి ముస్తాబాద్ మండలానికి వచ్చే కాలువ లో మురుగు నీరు కలుస్తున్న ప్రదేశాన్ని పరిశీలించి, నీరు దానిలో కలువకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి రైతు వేదిక వద్ద తహసిల్దార్ కార్యాలయానికి సంబంధించి నిర్మాణాన్ని పరిశీలించారు. కలెక్టర్ ముస్తాబాద్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతులు కొనసాగుతుండగా పరిశీలించారు. అదే ఆవరణలోని బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించి ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారని, ఎన్ని తరగతి గదులు ఉన్నాయో అడుగగా, మొత్తం 16 తరగతి గదులు, 120 మంది విద్యార్థులు చదువుతున్నారని అధికారులు తెలిపారు.
ఈ రెండు స్కూల్స్ లో కావాల్సిన వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదులు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించగా, స్కూల్ ఆవరణలో నీరు నిలువకుండా కచ్చా కలువ నిర్మించాలని, ఆవరణ శుభ్రం చేసి మొక్కలు నాటించాలని డీఅర్డీఓ శేషాద్రిని కలెక్టర్ ఆదేశించారు. తరగతి గదులు పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం డైనింగ్ హాల్ లో సిద్ధంగా ఉన్నా ఆహార పదార్థాలు పరిశీలించారు. మెనూ ప్రకారం అందుస్తున్నరా అని విద్యాలయం బాధ్యులను అడిగి తెలుసుకున్నారు ఈ. కార్యక్రమంలో సిరిసిల్ల నియోజవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి డీఈఓ రమేష్ కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి, మండల ప్రత్యేక అధికారి లత, సెస్ డైరెక్టర్ అంజి రెడ్డి, తహసిల్దార్ సురేష్, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.