Homeహైదరాబాద్latest Newsప్రతి మెగా అభిమాని అంటూ… 'పుష్ప 2' మూవీపై నాగబాబు సంచలన ట్విట్..!

ప్రతి మెగా అభిమాని అంటూ… ‘పుష్ప 2’ మూవీపై నాగబాబు సంచలన ట్విట్..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమాపై నాగబాబు సంచలన ట్విట్ చేసారు.సినిమా అంటే 24 క్రాఫ్ట్ ల కష్టంతో.. వందలాది మంది కష్టానికి ఫలితం దక్కుతుంది. సినీ పరిశ్రమలో వేల మంది పనిచేస్తున్నారు, మనమంతా పరిశ్రమలో భాగమే. ప్రతి సినిమా విజయం సాధించాలని కోరుకుందాం అని నాగబాబు అన్నారు. అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను అని నాగబాబు సంచలన ట్విట్ చేసారు. అయితే ఈ సినిమా పేరును ట్విట్ లో నాగబాబు ప్రస్తావించకపోయినా.. పరోక్షంగా ‘పుష్ప 2’ మూవీని ఉద్దేశించి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img