Homeహైదరాబాద్latest Newsఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు.. అప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా :...

ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు.. అప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా : మంత్రి శ్రీధర్ బాబు

మండలి ప్రభుత్వ చీఫ్ విప్ సహా నియామకాలు రాజ్యాంగం ప్రకారమే జరిగాయని, ఎక్కడా ఉల్లంఘన జరగలేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మాజీ మంత్రి హరీశ్​రావు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదని ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో హరీశ్​రావు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసని, అప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఒకరి తర్వాత ఒకరు పార్టీలో చేర్చుకున్నారని మంత్రి గుర్తు చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే మండలి చైర్మన్, చైర్మన్ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. సంప్రదాయం ప్రకారం పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష సభ్యుడికి ఇచ్చారని మంత్రి తెలిపారు.

Recent

- Advertisment -spot_img