ఇదేనిజం,శేరిలింగంపల్లి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండలో స్థానిక నాయకుల తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా బావితరాలకు అందించాలని, పచ్చదనం, పరిశుభ్రతతో మన పరిసరాలు విరాజిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇంటి పరిసరాలు, పాఠశాలల చుట్టుపక్కల, ఖాళీ స్థలాల్లో, రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తండావాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీ ఈ దుర్గాప్రసాద్, వార్డ్ ఆఫీసర్ కృష్ణ, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నడిగడ్డ తండ వాసులు తదితరులు పాల్గొన్నారు.