Homeహైదరాబాద్latest Newsబాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలి

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలి

  • చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరిగురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు.
  • బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి)

ఇదేనిజం ధర్మారం: రామగుండము పోలీస్ కమిషనరేటు పరిధిలోని మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి, పెద్దపల్లి, గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో జూలై 1 నుండి 31-07-2024 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ లో పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు , పోలీస్ శాఖా పరంగా ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్.ఐ , నలుగురు సిబ్బందిని నియమించి టీం లు ఏర్పాటు చేసి అందరి సమన్వయంతో విధులు నిర్వర్తించి రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిదిలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం జరుగుతుందని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ…. అన్ని శాఖల సమన్వయంతో పని చేసి ముస్కాన్-X కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 18సంవత్సరాల లోపు తప్పిపోయిన/ వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులు కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, వివిధ కంపని లలో పనిచేస్తూ మరియు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుంది. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన, వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేయడం జరుగుతుందని, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో చిన్నపిల్లలతో పని చేపించే వారిపై నిత్యం నిఘా ఉంటుందని తెలిపారు. బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ది సాధ్యమవుతుందని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపడుతున్నామని సిపి తెలిపారు.

రామగుండము పోలీస్ కమిషనరేటు పరిధిలో ఎక్కడైనా బాల కార్మికులు పని చేస్తూ కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా స్థానిక పోలీస్ లకు సమాచారం అందించాలని ఈ ట్రోల్ ఫ్రీ నంబర్స్ 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు.

  1. మంచిర్యాల సబ్ డివిజన్ ఇంచార్జి ఎస్.ఐ : 9848815120
  2. జైపూర్ సబ్ డివిజన్ ఇంచార్జి ఎస్.ఐ : 9441122702
  3. బెల్లంపల్లి సబ్ డివిజన్ ఇంచార్జి ఎస్.ఐ : 9490435081
  4. పెద్దపల్లి సబ్ డివిజన్ ఇంచార్జి ఎస్.ఐ : 8712656507
  5. గోదావరిఖని సబ్ డివిజన్ ఇంచార్జి ఎస్.ఐ : 9885508894 లకు ఫోన్ చేసి సమాచారం అందించగలరు అని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును.

Recent

- Advertisment -spot_img