Homeహైదరాబాద్latest Newsరామ్ చరణ్‌లో అన్నీ మారాయి ఆ ఒకటి తప్ప : శ్రీకాంత్

రామ్ చరణ్‌లో అన్నీ మారాయి ఆ ఒకటి తప్ప : శ్రీకాంత్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుగుతుంది. ఈ సభలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. పవర్ స్టార్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజులు తరువాత ఈరోజు కలుసుకోవడం చాల సంతోషంగా ఉంది. డైరెక్టర్ శంకర్ గారికి నేను థాంక్స్ చెబుతున్నాను.. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయడం నాకు కూడా కొత్త.. ఒక డేర్ చేశాను అని అనుకుంటున్నాను..నా మీద ఉన్న నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చిన శంకర్ గారికి నా కృతజ్ఞతలు… మా చరణ్ గురించి నేను మాట్లాడాలి నేను రెండో సినిమా తనతో చేయడం.. గతంలో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చేసాం.. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేసాం అని తెలిపారు. అప్పుడికి ఇప్పుడికి ఎంత చేంజ్ అంటే పెర్ఫార్మన్స్ లెవెల్ అంతకముందు ‘రంగస్థలం’.. ‘RRR’.. ఇప్పుడు ఈ సినిమాలో అంతకుమించి పెర్ఫార్మెన్స్ ఈ రెండు క్యారెక్టర్ లు ద్వారా చూపించబోతున్నారు. రామ్ చరణ్ ను చూస్తే అన్నయ్య మెగా స్టార్ ని చూసినట్టే ఉంటుంది. కానీ అన్నీ మారాయి ఆ ఒకటి తప్ప అదే బిహేవియర్.. ఎదిగిన కొద్దీ అణగిమణగీ ఉండటం చాలా గొప్ప విషయం..ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నా అని శ్రీకాంత్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img