బొజ్జ గణపయ్య అనుగ్రహం మనపై ఉండాలంటే వినాయక చవితి రోజున కొన్ని పనులు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ రోజున వినాయకుడిని అత్యంత భక్తితో పూజించాలి. నియమ నిష్టలతో పూజించడం వల్ల సమస్త సమస్యలు తీరుతాయి. ఓం గం గణపతయే నమః, ఓం విఘ్నేశ్వర నమ: అనే మంత్రాలను ఆ రోజున జపిస్తే వినాయకుడి అనుగ్రహం పొందుతారు. ఇంట్లో తయారు చేసిన కుడుములు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు పేదలకు ఆహారం, బట్టలు దానం చేస్తే మంచిది.