ఏపీకి సీఎంగా జగన్ చేసిన పనులే విజయవాడ ప్రజలను వరదల నుంచి గట్టెక్కిస్తున్నాయని మాజీ మంత్రి రోజా అన్నారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ, రిటైనింగ్ వాల్, వైసీపీ హయాంలో కొన్న 104, 108, క్లీన్ ఆంధ్ర వాహనాలు, వైఎస్సార్ హెల్త్ సెంటర్లు ప్రజలకు కష్టకాలంలో ఉపయోగపడుతున్నాయని ఆమె ట్వీట్ చేశారు.