ఇదే నిజం, కంది : కంది మండలం ఎడ్ల రేగడి తండా గ్రామపంచాయతీలో నీటి సమస్యపై నారాయణ్‌ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరాతీశారు. మంచినీళ్ల కోసం ఓ నల్లా వద్ద స్థానికులు గుమిగూడటాన్ని అటుగా కారులో వెళ్తోన్న ఎమ్మెల్యే గమనించారు. కారు ఆపి వారితో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ప్రజలకు నీటి సమస్యలు రాలేదని వారితో ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటి సమస్యలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం సిగ్గుచేటు అని విమర్శించారు.