Homeతెలంగాణఉత్కంఠగా దుబ్బాక ఉపఎన్నిక

ఉత్కంఠగా దుబ్బాక ఉపఎన్నిక

దుబ్బాక ఉప ఎన్నికలు అన్ని పార్టీల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక మీద అన్ని పార్టీలు దృష్టి సారించాయి. దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీకి అయా పార్టీల అభ్యర్థులు గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్కో పార్టీలో ఇద్దరిద్దరు లీడర్లు ఎమ్మెల్యే అభ్యర్థిని  నేనంటే నేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

అధికార పార్టీకి చెందిన నేతల్లో రామలింగారెడ్డి కొడుకు సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికే  రాష్ట్ర నాయకత్వం మాత్రం చనిపోయిన ప్రస్తుత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కొడుక్కు టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ రాకపోతే ముత్యం రెడ్డికి కాంగ్రెస్ పార్టీ లో మంచి పేరు ఉండడంతో కాంగ్రేస్​ పార్టీ లేదా ఇండిపెండెంట్​గా అయినా పోటీలో దిగాలని ఆలోచిస్తున్నారు..

ఇక బీజేపీ నుంచి టీఆర్​ఎస్​కు గట్టి పోటీ వస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ బీజేపీలో సైతం అంతర్గత పోటీ ఉందని, రఘునందన్​రావుకు పోటీగా బీజేపీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో నేత టికెట్​ ఆశిస్తున్నట్లు, ఇప్పటికే తనకు టికెట్​ ఖరారు అయినట్లు  ప్రచారం కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. కానీ పార్టీ క్యాడెర్​లో మాత్రం రఘునందన్​ రావు పట్ల విజయం  పట్ల  నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సమయంలో చాలా మందికి తెలియని నేతను బీజేపీ దుబ్బాకలో బరిలో దింపదనే కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక నియెజికవర్గం నుంచి రఘునందన్​ రావు గతంలో 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావు ఓటమి చెందారు. ఆ తర్వాత 2019లో బీజేపీ నుంచి మెదక్ ఎంపీ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి రఘునందన్​కు టికెట్​ పక్కా అయితే టీఆర్ఎస్, బీజేపీ మద్య పోటీ గట్టిగా ఉండొచ్చని, టీఆర్​ఎస్​ పార్టీలో మాదిరిగా బీజేపీ నాయకత్వం గట్టిగా రఘునందన్​కు అదిష్టానం సపోర్ట్​ చేస్తే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img