కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘దేవర’. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు ‘భైరా’ పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ సైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన గ్లిమ్స్‌ను మూవీ టీం విడుదల చేసింది. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.