Homeరాజకీయాలుమృతుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా: KTR

మృతుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా: KTR

నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. అక్కడి అధికారులు, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు మంత్రులు తీవ్ర సంతాపం తెలిపారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. అస్వస్థతకు గురైనవారికి ఉస్మానియాలో మెరుగైన వైద్యం అందిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్‌రెడ్డి ప్రమాదస్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. ‘బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది’అని విమర్శించారు.

Recent

- Advertisment -spot_img