Exit Polls 2024: మరికొద్దిగంటల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి. ఇవాల్టితో దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ముగుస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కాసేపట్లో (6.30 గంటల తర్వాత) వెలువడనున్నాయి. ఫలితాలకు దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థులతో పాటు ఓటర్లలోనూ ఉత్కంఠ నెలకొంది. తెలంగాణాలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయన్న దానిపై ఎగ్జిట్ పోల్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈసారి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ మళ్లీ గెలుస్తుందా? లేదంటే.. ఈసారి టీడీపీకి ప్రజలు పట్టం కడతారా? అది చూడాలి. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా వస్తాయని ఏపీ ప్రజలు, నేతలు, రాజకీయ విశ్లేషకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.