ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ప్రముఖ సర్వే సంస్థ ఆరా వివరాలను వెల్లడించింది. YCP 94-104 సీట్లు గెలుచుకొని మరోసారి అధికారంలోకి వస్తున్నదని అంచనా. కూటమికి 71 సీట్లు రానున్నట్లు చెప్పారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్, కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేశ్ భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. పులివెందుల నుంచి జగన్ భారీ మెజార్టీతో గెలవబోతున్నరాని తెలిపారు. ప్రస్తుత మంత్రులు భారీ పోటీని ఎదుర్కోనున్నారు. బొత్స సత్యనారాయణ గెలవనున్నారు. గుడివాడ్ అమర్నాథ్ పరాజయం పాలవనున్నారు. చందుపట్ల వేణుగోేపాల్ ఓడిపోతున్నారు. మంత్రి సత్యనారాయణ ఓటమిపాలవనున్నారు. పెనమలూరు నుంచి ప్రస్తుత మంత్రి జోగి రమేష్ గట్టి పోటీ ఎదుకానుంది.
అంబటి రాంబాబు గట్టి పోటీ ఉండనుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని స్వల్ప మెజార్టీతో ఓడిపోనున్నారు. కాసాని గోవర్థన్, బుగ్గన రాజేంద్రనాథ్ గెలవనున్నారు. కడప నుంచి ఉపముఖ్యమంత్రి అమ్జద్ పాషా స్వల్ప ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉంది. పుంగనూరు అసెంబ్లీ అభ్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి భారీ మెజార్టీతో గెలవనున్నారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి ఆర్కే రోజా ఓటమి చవిచూడనున్నారు. టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు స్వల్ప ఆధిక్యంతో గెలవనున్నారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గెలవనున్నారు.