తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు చివరి దశకు చేరుకుంది. అన్నీ కుదిరితే రేపు కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విస్తరణలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని అదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లాలకు అవకాశం కల్పించేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని AICC భావిస్తున్నట్లు తెలిసింది. CM రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలతో చర్చించిన తర్వాత AICC తుది నిర్ణయo తీసుకోనుంది.
అయితే నిజామాబాద్ నుంచి బోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్ పేర్ల పై దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు ఏఐసీసీ సుముఖంగా ఉన్న సంగతి తెలిసిందే.