– నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు.
– బట్ట సంచుల వాడకంపై ప్రచారం
ఇదే నిజం, కోరుట్ల: కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్లాస్టిక్ ఏజెన్సీలు, కిరాణా షాపులు, హోటల్స్ రెస్టారెంట్లతోపాటు బేకరీలలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ సంచులను వాడుతున్న వారిపై జరిమానాలు విధించడంతో పాటు పరిశుభ్రతను తనిఖీ చేపట్టారు. అంతేకాకుండా బట్ట సంచుల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్ స్పెక్టర్ గజానంద్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఆకు అంజయ్య, రమేశ్, రాజు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు
తనిఖీల్లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ.. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధానికి దుకాణదారులందరూ సహకరించాలని, రెస్టారెంట్లు, హోటల్స్ నాణ్యత ప్రమాలను, పరిశుభ్రతను పాటించాలని కోరారు. లేదంటే భారీ జరిమానాలు విధించడంతోపాటు వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు.