తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఏపీలోని 35 మండలాల్లో తీవ్రమైన తీవ్ర వడగాలులు, మరో 167 మండలాల్లో మోస్తరుగా వడగాలులు నమోదైనట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఆదిలాబాద్ 40.6 డిగ్రీలు, కొమురంభీం 40.5 డిగ్రీలు, భద్రాద్రి 40.1 డిగ్రీలు, మెదక్ 39.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీ కర్నూలు 40.6 డిగ్రీలు, నందిగామ 40 డిగ్రీలు, అనంతపురం 39.2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైంది.