Homeఆంధ్రప్రదేశ్విపరీతంగా పెరిగిన ఎండ తీవ్ర‌త‌.. తస్మాత్ జాగ్రత్త..!

విపరీతంగా పెరిగిన ఎండ తీవ్ర‌త‌.. తస్మాత్ జాగ్రత్త..!

నిన్నమొన్నటి వరకు చలి తీవ్రంగా ఉండగా, ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజలు వేసవి ఇప్పుడే ప్రారంభమైందని అంటున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్ర‌త‌ పెరుగుతోంది. మధ్యాహ్నం వేళ మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే ఏపీలో 35 డిగ్రీల‌కు పైగా స‌గ‌టు ఉష్ణోగ్ర‌తలు న‌మోదు అవుతున్నాయి. అధికారుల తాజా లెక్క‌ల ప్ర‌కారం గురువారం క‌ర్నూలు జిల్లాలోని సి.బెల‌గల్‌లో 35.9 సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. అలాగే స‌త్య‌సాయి జిల్లా కొత్త చెరువులో, నంద్యాల‌, కృష్ణా జిల్లా హ‌నుమాన్ జంక్ష‌న్‌, ప్ర‌కాశం జిల్లా క‌నిగిరిలో కూడా 35.9 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img