అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదానీతో రేవంత్ దోస్తీకి సంబంధించిన టీ షర్ట్లు వేసుకోని రావడంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. వాటిని తొలగిస్తేనే అసెంబ్లీలోకి అనుమతిస్తామన్నారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు.