Homeజిల్లా వార్తలుకౌటాలలో కంటి వైద్యశిబిరం

కౌటాలలో కంటి వైద్యశిబిరం

ఇదే నిజం, చింతల మనేపల్లి: కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలంలో లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కొమురం భీం జిల్లా అధ్యక్షుడు, లైన్స్ క్లబ్ ప్రోగ్రాం చేర్మన్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంటి పరీక్షలకు 150 మంది హాజరయ్యారని.. వారిలో అవసరమైన వారికి శస్త్ర చికిత్స చేస్తామని చెప్పారు. గత 11 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్ లు చేయిస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img