జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థినిలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 124 మంది విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. 4 విద్యార్థినిలకు కంటి జోళ్ళు అందజేసినట్లు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థి దశ నుండి కంటి చూపు పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నరేష్, తిరుపతి, గట్టు శ్రీధర్, వైద్య సిబ్బంది మరియు కస్తూర్బా ఉపాధ్యాయులు పద్మ,తదితరులు పాల్గొన్నారు.