ఫెయింజల్ తుఫాన్ ఎఫెక్ట్ తో చెన్నైలో కుండపోత వర్షం కురుస్తుంది. చెన్నైలోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. దీంతో చెన్నైలో రోడ్లు అన్ని నీరుతో నిండిపోయాయి. అయితే కరెంట్ షాక్ కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. భారీ వర్షాలు కారణంగా మెరీనా బీచ్ నిర్మానుషంగా మారింది. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని సాయంత్రం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.ట్రాక్ పైకి వర్షపు నీరు చేరడంతో ఎలక్ట్రిక్ ట్రైన్ సర్వీసులు అన్ని నిలిచిపోయాయి. అయితే సాయంత్రంలోపు కారైకల్, మహాబలిపురం మధ్య ఫెయింజల్ తుఫాన్ తీరాన్ని దాటనుంది.