Hyderabad : హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి లో రూ. 7 లక్షల విలువైన 500 నోట్ల ఫేక్ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు రూ. 75 లక్షలు ప్రింట్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.