కేంద్ర హోంశాఖ.. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన రూ.500 నకిలీ నోట్లు చెలామణిలోకి వచ్చినట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నోట్లు అసలు నోట్లలాగే అచ్చం ఉండి, గుర్తించడం కష్టంగా ఉన్నాయని, కానీ “RESERVE BANK OF INDIA”లో “RESERVE” పదంలో ‘E’ బదులు ‘A’ అనే స్పెల్లింగ్ తప్పు ఉందని తెలిపింది. ఈ చిన్న తప్పును కనిపెట్టాలంటే నోటును జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ నకిలీ నోట్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లో ఉన్నాయని, వీటిని గుర్తించడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ప్రజలు, వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.