హైడ్రాపై కేటీఆర్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ, చేయిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా మీద తప్పుడు ప్రచారం చేయించేందుకే కేటీఆర్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చారని కీలక ఆరోపణలు చేశారు. ఒవైసీ, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిల విద్యాసంస్థలకు సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇచ్చారన్నారు. కేవలం విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొనే సమయం ఇచ్చారని అన్నారు. అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక నిబంధనల మేరకు కూల్చివేతలు ఉంటాయని స్పష్టం చేశారు.