తెలంగాణలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి అక్టోబరు 3వ తేదీ నుంచి ఇంటింటి పరిశీలన చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. “గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో స్థాయి అధికారి, పట్టణ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షకులుగా ఉంటారు. ఈ పరిశీలన సమగ్రంగా, కచ్చితత్వంతో చేపట్టాలి. లోపాలకు తావివ్వకూడదు” అని సీఎం స్పష్టంచేశారు.