Homeసినిమాఆ డేట్​కే రాబోతున్న ఫ్యామిలీ స్టార్..

ఆ డేట్​కే రాబోతున్న ఫ్యామిలీ స్టార్..

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ట్​నర్ ‘ఫ్యామిలీ స్టార్’. టైటిల్ రివీల్​తోనే మంచి బజ్ నమోదు చేసిన ఈ మూవీని తొలుత సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయ్యినట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. దీంతో ఈ సినిమా జనవరి 26కి షిఫ్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ డేట్ నుంచి కూడా సినిమా షిఫ్ట్ అయ్యి మార్చిలో రిలీజ్​ కానున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఆల్రెడీ మార్చి 8న లాక్ అయిన డబుల్ ఇస్మార్ట్, లేటెస్ట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ఫ్యామిలీ స్టార్ కూడా నిలిచే చాన్స్ ఉందనే బజ్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img