హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మే 3 నుంచి స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారట. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది.