తెలుగులో కామెడీ షో జబర్దస్త్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. రీతూ చౌదరి ఈ షో తర్వాత చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరియు అనేక షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఓ పెద్ద స్కామ్‌లో చిక్కుకుంది. ప్రస్తుతం వెండితెరపై సంచలనం సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతాలకు సంబంధించి రూ.700 కోట్ల ఆస్తుల కుంభకోణంలో రీతూ చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఈ భూ కుంభకోణంలో ఆమె కూడా నిందితురాలిగా ఉన్నట్లు సమాచారం.
700 కోట్ల విలువైన ఈ భూ కుంభకోణానికి పాల్పడిన చీమకుర్తి శ్రీకాంత్‌తో రీతూ చౌదరికి గతంలో వివాహమైన సంగతి తెలిసిందే. అంతే కాదు శ్రీకాంత్ రూ.వందల కోట్ల విలువైన భూమిని రీతూ చౌదరి పేరిట రిజిష్టర్ చేయించాడని…దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ పత్రాలపై రీతూ చౌదరి ఫోటో, సంతకం, వేలిముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ల్యాండ్ మాఫియాలో పలువురు పెద్ద మనుషుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డి పేరు కూడా చర్చనీయాంశమైంది.
తాజాగా ఈ స్కామ్‌పై రీతూ చౌదరి స్పందించారు. గత ఏడాది కాలంగా శ్రీకాంత్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ఇప్పుడు అతడితో ఎలాంటి సంబంధాలు లేవని… ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పారు.శ్రీకాంత్‌తో ఉన్నప్పుడు సంతకం చేయమని అడిగితే అలా చేశా. అయితే కోట్ల రూపాయల విలువ చేసే భూముల సంగతి నాకు తెలియదు. తనకు తెలియని విషయాల్లోకి ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇంతలో రీతూ మాజీ భర్త ఫోటో చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.