నివేతా పేతురాజ్ హీరోయినిగా తమిళ మరియు తెలుగు సినిమాల్లో నటించింది. అనే తమిళ చిత్రం ఒరు నాల్ కూతు (2016) తో ఆమె తొలిసారిగా నటించింది . ఆ తర్వాత మెంటల్ మదిలో (2017) తో తెలుగులోకి అడుగుపెట్టింది. నివేతా పేతురాజ్ ఆ తరువాత వరుసగా తెలుగు సినిమాల్లో చిత్రలహరి, పాగల్, దాస్ కా ధమ్కి వంటి సినిమాల్లో నటించింది. అయితే నివేదా పేతురాజ్ కి ఒక అనూహ్య సంఘటన ఎదురయ్యింది.
చెన్నైలోని అడయార్ సిగ్నల్ వద్ద ఆగిన 8 ఏళ్ల బాలుడి చేతిలో నివేదా పేతురాజ్ మోసపోయింది. ఈ విషయాన్ని హీరోయిన్ నివేదా పేతురాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తెలిపింది. అందులో నివేదా పేతురాజ్ అడయార్ సిగ్నల్ లో 8 ఏళ్ల బాలుడి డబ్బులు అడిగానని, అయితే నేను ఉచితంగా డబ్బులు చెల్లించడానికి నిరాకరించాను అని ఆమె తెలిపింది. ఆ తర్వాత ఆ బాలుడు పుస్తకాన్ని అమ్మేందుకు ప్రయత్నించాడు అని పేర్కొంది. ఆ బాలుడు ఓ పుస్తకం చూపించి 100 రూపాయలు అడిగాడని, 100 తీసుకుంటుండగా 500 ఇవ్వాలని అడిగాడని నివేదా చెప్పింది. అయితే 500 రూపాయలు అడగడంతో పుస్తకం తిరిగి ఇచ్చి, ఇచ్చిన 100 రూపాయలు తీసుకున్నానని, ఇంతలోనే ఆ బాలుడు పుస్తకం కారులోకి విసిరి డబ్బులు లాక్కుని పారిపోయాడని నివేదా పేర్కొన్నారు. ఇలా బెదిరింపులతో అడుక్కోవడం కూడా మామూలేనా అని ఆమె ప్రశ్నించారు.