ప్రముఖ నటి, బీజేపీ నేత జయప్రద మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఆమె కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు జయప్రదను ఆదేశించింది. అయినా కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది.
జనవరి 10న కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో రాంపూర్ ఎస్పీ ఆమెను వెతికేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 19, 2019న జయప్రద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ యూపీలోని ఓ ప్రాంతంలో రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఓ సభలో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. రెండు కేసుల్లో నిందితురాలిగా ఉన్న జయప్రద తాజాగా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.