తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదలకు శుభ ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై 20న జరిగే క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం ఉంటుంది. రైతు భరోసా కోసం ప్రభుత్వం ఆల్రెడీ నిధులు రెడీ చేసుకున్నట్లు సమాచారం. దసరా నాడు రైతు భరోసాని అమలు చేసే అవకాశాలున్నాయి. రైతుల అకౌంట్లలో ఎప్పుడు మనీ జమ చేసేదీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.