ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన బొలిశెట్టి ప్రభాకర్ (39) అనే వ్యక్తి గత నెల 22న పగలు 12 గంటలకు తన యొక్క పొలంలో ఒడ్లు పెట్టడానికి వెళ్లి అనంతరం ఒడ్డు మీద తంసాప్ సీసాలో గల గడ్డి మందుని,అది గడ్డి మందు అని తెలువక తాంసప్ అనుకొని తాగగ అతనిని వెంటనే చికిత్స గురించి జగిత్యాల లోని శ్రద్ధ ఆస్పటల్ అక్కడి నుండి కరీంనగర్ లోని సన్ షైన్ హాస్పిటల్ అక్కడి నుండి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రి నందు చేర్పించి చికిత్స చేయిస్తుండగా నిన్న అనగా 2- 8 -2024 రోజున ప్రభాకర్ చికిత్స పొందుతూ మరణించినాడని అతని తల్లి బొలిశెట్టి లక్ష్మి ఫిర్యాదు మేరకు గొల్లపెల్లి ఎస్ఐ చిర్ర సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.