Homeహైదరాబాద్latest Newsఅప్పటి లోపు రైతు రుణమాఫీ పూర్తి..!

అప్పటి లోపు రైతు రుణమాఫీ పూర్తి..!

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. మూడు విడతలుగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు అమలు చేశారు. అయితే అర్హులైన కొంత మంది రైతులకు రుణమాఫీ అందలేదు దీంతో ఆయా రైతులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పెండింగ్లో ఉన్న మరో రూ.13 వేల కోట్లు త్వరనే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. పంటలకు మద్దతు ధర ఇస్తామని, రైతులు అధైర్యపడొద్దని భరోసా కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. డిసెంబర్ ఆఖరిలోపు రైతులకు పెండింగ్లో ఉన్న రుణమాఫీ రూ.13వేల కోట్లను పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ సర్కార్ చెబుతుంది. రైతులు పండించిన చివరి గింజ వరకూ కొంటామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img