Homeహైదరాబాద్latest NewsFarmer Registry : రైతులకు అలర్ట్.. ఆ పథకాలు కావాలంటే ఈ కార్డు ఉండాల్సిందే..!!

Farmer Registry : రైతులకు అలర్ట్.. ఆ పథకాలు కావాలంటే ఈ కార్డు ఉండాల్సిందే..!!

Farmer Registry : కేంద్ర ప్రభుత్వం ”ఫార్మర్ రిజిస్ట్రీ” (Farmer Registry) ద్వారా రాష్ట్రంలోని రైతులకు ఒక నిర్దిష్ట గుర్తింపు సంఖ్యను (14 అంకెలు) జారీ చేస్తోంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి రైతులు ఈ సంఖ్యను పొందడం చాలా ముఖ్యం. ప్రస్తుతం, ఈ నమోదు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో జరుగుతోంది. రైతులు తమ వివరాలను నమోదు చేసుకుని గుర్తింపు సంఖ్యను పొందాలి. ఈ కార్డు కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, మొబైల్ నంబర్ కలిగి ఉండాలి.

కార్డు అప్లై విధానం : సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించాలి. అలాగే అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఆ తరువాత RSK సిబ్బంది నియమించబడిన పోర్టల్‌లో రైతు వివరాలను నమోదు చేస్తారు.రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే, రైతు మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. OTP నమోదు చేసిన తర్వాత, ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించబడుతుంది.

ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు ప్రయోజనాలు : పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, వ్యవసాయ పరికరాల రాయితీలు, పంట నష్టపరిహారం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ క్రమంలో భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈ గుర్తింపు సంఖ్యను పొందాలి. అలాగే నమోదు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. మీకు ఏవైనా సమస్యలుంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించండి.

Recent

- Advertisment -spot_img