Homeహైదరాబాద్latest Newsకేసీఆర్ పాలనలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు.. ! రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ పాలనలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు.. ! రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పెద్దపల్లిలో యువ వికాసం సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో గ్రూప్-4లో ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.ఈ నేపథ్యంలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు గిట్టుబాటు ధర రాలేదు.. కేసీఆర్‌కు మాత్రం ఎకరాకు కోటి రూపాయల పంట పండింది ఎకరాకు కోటి ఆదాయం ఇప్పటికీ ఓ బ్రహ్మపదార్థమే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కేసీఆర్ గజ్వేల్‌లో తన పొలంలో ఎకరాకు కోటి సంపాదిస్తున్నారు అని అన్నారు. గత ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయలేదని రేవంత్ ఆరోపించారు. పదేళ్లుగా ఏం చేయకపోగా, 10 నెలల మా పాలనపై విష ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంది అని
రేవంత్ రెడ్డి తెలిపారు.

Recent

- Advertisment -spot_img