Homeహైదరాబాద్latest Newsయాసంగి తిప్పలు.. మీకు రైతుబంధు డబ్బులు జమ అయ్యాయా..?

యాసంగి తిప్పలు.. మీకు రైతుబంధు డబ్బులు జమ అయ్యాయా..?

రైతుబంధు డబ్బులు దశల వారీగా జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు రెండు ఎకరాల లోపు రైతు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. కొంత మంది రైతులు మాత్రం జమ కాలేదని అంటున్నారు. యాసంగి సీజన్ స్టార్ అయిన్పటికీ ఇంకా రైతుబంధు డబ్బులు ఇప్పటి వరకు జమ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులు ప్రతి రోజు బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. ఎక్కడకు వెళ్లిన పరిష్కారం దొరకకపోవడంతో అసలు రైతుబంధు డబ్బులు వస్తాయా..? రావా..? అన్న సందేహంలో ఉన్నారు. బ్యాంకులు కొత్తగా అప్పులు ఇవ్వకపోవడంతో పెట్టుబడి కోసం ఆందోళన చెందుతున్నారు. అయితే అధికారులు రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు జమ అయ్యాయని చెబుతున్నారు.. కానీ రైతులు మాత్రం జమ అవ్వలేదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని రైతుబంధు నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img