Homeహైదరాబాద్latest Newsధాన్యం నగదు 48 గంటల్లోనే

ధాన్యం నగదు 48 గంటల్లోనే

  • సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న రైతులు
  • జిల్లాలో ఇప్పటి వరకు రూ.262 కోట్ల చెల్లింపులు

ఇదే నిజం, జోగిపేటః సంగారెడ్డి జిల్లాలో వరికొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం డబ్బులు 48 గంటల్లో రైతులకు ఖాతాల్లో రావడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1.50 లక్షల టన్నుల ధాన్యంను రైతుల ద్వారా సేకరించేందుకు 211 కొనుగోలు కేంద్రాలను ఏకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 23,651 మంది రైతుల వద్ద నుంచి 1.25 లక్షల టన్నుల ధాన్యంను సేకరించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యంనకు సంబంధించి రూ.262 కోట్లు రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. రెండు రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు అప్పగించిన వరి ధాన్యం డబ్బులు కేవలం 48 గంటల్లో ఖాతాల్లోకి డబ్బులు జమ కావడంపై పలువురు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో ధాన్యం విక్రయించిన తర్వాత 20, 30 రోజుల వరకు కూడా డబ్బులు ఖాతాల్లోకి రాకపోవడంతో కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ రైతులు తిరిగి ఇబ్బంది పడ్డ పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు.


జూన్‌ మొదటి వారంలోగా కొనుగోలు పూర్తి

జిల్లాలో ఇంకా 5 నుంచి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సి ఉందని డీఎస్‌ఓ వనజాత తెలిపారు. జూన్‌ మొదటి వారంలోగా కొనుగోలు చేస్తామన్నారు. వారం, పది రోజుల పాటు కేంద్రాలు కొనసాగుతాయని, పూర్తి స్థాయిలో ధాన్యంను కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందకూడదని అన్నారు.


రెండు రోజుల్లోనే వచ్చాయ్‌…
‘పండించిన వరి ధాన్యంను కన్‌సాన్‌పల్లిలోని పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో 132 సంచుల వరి ధాన్యంను విక్రయించాను. సోమవారం మద్యాహ్నం విక్రయించిన దాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగా బుధవారం మద్యాహ్నం రూ.1.16 లక్షలు ఖాతాల్లో జమ అయినట్లు ఫోన్‌లో మెస్సేజ్‌ వచ్చింది. మొదటి సారి రెండు రోజుల్లోనే ధాన్యం డబ్బులు ఇంత తొందరగా రావడం సంతోషాన్నిచ్చింది. డబ్బులు తొందరగా ఖాతాలో వేయడం వల్ల ఖరీఫ్ సీజన్‌కు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది’ – సదానందం, రైతు, కన్‌సాన్‌పల్లి

Recent

- Advertisment -spot_img