టోల్ ఫీజు ప్లాజాల నుండి రిటర్న్ జర్నీ డిస్కౌంట్ లేదా మరే ఇతర మినహాయింపులను పొందటానికైనా, ఫాస్ట్ ట్యాగ్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 24 గంటలలోపు రిటర్న్ జర్నీ రాయితీ లేదా ఇతర స్థానిక మినహాయింపుల కోసం డిస్కౌంట్ పొందాలనుకునే వినియోగదారులు, తమ వాహనంపై చెల్లుబాటు అయ్యే ఫంక్షనల్ ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉండాలి. ఈ విషయాన్ని, జాతీయ రహదారుల రుసుము (రేట్లు మరియు సేకరణల నిర్ధారణ) నిబంధనలు, 2008 ని సవరిస్తూ, 2020 ఆగష్టు, 24వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ నెంబరు:534 ఈ లో ప్రకటించారు.
జాతీయ రహదారుల ఫీజు ప్లాజా ల వద్ద డిజిటల్ చెల్లింపుల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఇది మరొక దశ. అటువంటి డిస్కౌంట్లకు చెల్లించవలసిన రుసుము ప్రీ-పెయిడ్ ఇనుస్ట్రుమెంట్సు, స్మార్ట్ కార్డు ద్వారా లేదా ఫాస్ట్ ట్యాగ్ ద్వారా లేదా బోర్డ్ యూనిట్ (ట్రాన్స్ పాండర్) ద్వారా లేదా అలాంటి ఇతర పరికరాల ద్వారా మాత్రమే చెల్లించబడుతుంది.
నిబంధనలకు చేసిన సవరణలు ఈ విధంగా ఉన్నాయి:
i) 24 గంటల్లో తిరిగి ప్రయాణానికి తగ్గింపు ఫాస్ట్ ట్యాగ్ లేదా ఇతర పరికరం ద్వారా ఆటోమేటిక్ గా లభిస్తుంది. దీనికి వేరే పాస్ అవసరం లేదు.
ii) అన్ని ఇతర కేసులపై తగ్గింపు కోసం, చెల్లుబాటు అయ్యే ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉండటం తప్పనిసరి.
ఈ సవరణ ప్రకారం, 24 గంటలలోపు తిరుగు ప్రయాణానికి తగ్గింపు అందుబాటులో ఉన్న సందర్భాల్లో, ముందస్తు రశీదు లేదా సమాచారం అవసరం లేదు. వాహనంపై చెల్లుబాటు అయ్యే మరియు ఫంక్షనల్ ఫాస్ట్‌టాగ్ తో 24 గంటల్లో తిరుగు ప్రయాణం చేస్తే, ఆ పౌరుడు ఆటోమేటిగ్గా తగ్గింపు పొందుతాడు.