ఇండియన్ పోర్‌బందర్ కోస్ట్ గార్డ్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు పైలట్లు మృతి చెందినట్లు సమాచారం. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ధ్రువ్ హెలికాప్టర్ సాధారణ పెట్రోలింగ్ కోసం బయలుదేరింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోర్ బందర్ సమీపంలో నేలపై కూలిపోయింది.హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.